ప్రతి మారుమూల పల్లికి నూతన వైభవం తీసుకొస్తామని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ, దేవసముద్రం, దేవసముద్రం వడ్డిపల్లి గ్రామం నందు సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.