రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం

68చూసినవారు
రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నియోజకవర్గం రూపురేఖలు మార్చి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ అన్నారు. గురువారం రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను కోరారు. కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్