రాజంపేట ప్రభుత్వ కళాశాలలో 208 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయగా 188 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రమణ రాజు ఆదివారం తెలిపారు. తమ కళాశాల 90% ఉత్తీర్ణత సాధించిందని ఆయన తెలిపారు. అధ్యాపకుల కృషి, విద్యార్థులు క్రమశిక్షణతో చదవడం వల్ల ఈ పరీక్షలలో ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు.