ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. తులసి దళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్ప నీరాజనం సమర్పించారు. ఇతర రాష్ట్రాల నుండి 2. 5 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థించారు.