సుండుపల్లి మండల పరిధిలోని తిమ్మసముద్రం బహుద నది దక్షిణ తీరాన ఒడ్డున వెలసి ఉన్న వీరాంజనేయ స్వామి తిరుణాల ఉత్సవంలో భాగంగా సోమవారం స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం పుణ్యా వచనం, ధ్వజారోహణం, నవగ్రహ పూజలు హారతి నిర్వహించారు. రాత్రికి లక్ష్మీ వారిచే హరికథ కాలక్షేపం నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.