ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం పరిసరాలలో టిటిడి అధికారులు పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టారు. ఆలయం వద్దగల బృందావనంలోనికి కొత్త మొక్కలను తెప్పించడం జరిగిందని అధికారులు గురువారం తెలిపారు. భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో బృందావనంలో ఈ మొక్కలు నాటడం వల్ల చల్లదనం ఏర్పడుతుందని, భక్తులు సేద తీరడానికి అనువుగా ఉంటుందని వారు తెలిపారు.