రాజంపేటలోని బిజెపి కార్యాలయంలో దేశం గర్వించదగ్గ వీరుల్లో స్వతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ మరియు బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వారు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదన్నారు.