శనివారం బాలరాసుపల్లి నుండి ఇసుక తరలిస్తున్న టిప్పర్ షికారిపాలెం ధగ్గర ఓ బైక్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు కింద పడిపోయాడు. ట్రిప్పర్ డ్రైవర్ లెక్క చేయకుండా రాయచోటి వైపు వెళ్ళాడు. సాధారణ గాయాలు అయ్యాయి. ఇందుకు గాను సీతంపేట ప్రజలు టిప్పర్లు ఆపి డ్రైవర్లు మాట్లాడడం జరిగింది. ఇసుక టిప్పర్లతో ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.