కడప చెన్నై జాతీయ రహదారి సిద్ధవటం మండలం కనుమలోపల్లి సమీపంలోని.. నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుండి తిరుపతికి వెళుతున్న నాన్ స్టాప్ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు రాజంపేట నుండి కడప ఇందిరా నగర్ వెళుతున్న ఆటోకు తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెనగలూరు మండలానికి చెందిన ఆటో డ్రైవర్ రామచంద్రయ్య (42) ఆటోలో ప్రయాణిస్తూ ఉండిన మహిళ నరసమ్మ(60) స్వల్ప గాయాలు అయ్యాయి.