వైద్య విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం

67చూసినవారు
వైద్య విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.