ఇసుక కొరత కారణంగా రైల్వే కోడూరు నుండి చిట్వేలు వరకు రోడ్డు విస్తీర్ణం పనులు ఆగాయని, త్వరలోనే రోడ్డు పనులు మొదలు పెడుతున్నట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. ఆదివారం కందులవారిపల్లెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు మీదుగా గాలేరు - నగరి కాలువ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.