ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. గర్భగుడిలో శ్రీ సీతారామలక్ష్మణుల్ని అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.