ఒంటిమిట్ట హరిజనవాడలో ఉచిత వైద్య శిబిరం

54చూసినవారు
ఒంటిమిట్ట హరిజనవాడలో ఉచిత వైద్య శిబిరం
ఒంటిమిట్ట హరిజనవాడలో గురువారం మేకపాటి నంద కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బృందం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హరిజనవాడలోని ప్రజలకు బిపి, షుగర్, మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు, వివిధ రకాలైన విష జ్వరాలకు పరీక్షలు నిర్వహించారు. సలహాలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించినందుకు నంద కిషోర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్