కడప చెన్నై జాతీయ రహదారిపై సిద్ధవటం మండలం పార్వతీపురం వద్ద ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. జమ్మలమడుగు నుండి తిరుపతి వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్ ఒక్కసారిగా కిందపడడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదమేమి జరగకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.