సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామాల్లోని పొలాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. గురువారం ఓబుల్ రెడ్డి అనే రైతు పొలంలో 30 మీటర్ల మోటర్ కేబుల్ వైరు దొంగిలించారు. దోసకాయ, పసుపు పంటలు సాగులో ఉన్నాయని, పంటకు నీళ్లు పారించాలంటే మోటరు లేకపోతే కష్టంగా ఉంటుందని రైతు వాపోయారు. ఇంతకు ముందు కూడా శివశంకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, రోసిరెడ్డి పొలాల్లో కూడా వరుసగా వైర్లను దొంగలించారని రైతులు తెలిపారు.