సిద్ధవటం: కడప - చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

58చూసినవారు
సిద్ధవటం: కడప - చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
జాతీయ రహదారిలో మరమ్మత్తులు కారణంగా బుధవారం రాత్రి కడప - చెన్నై జాతీయ రహదారిపై సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్ధవటం పోలీసు అధికారులు స్పందించి బారులు తీరిన వాహనాల ట్రాఫిక్ సమస్యలను వెంటనే పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్