ఒంటిమిట్టలో కోదండరామస్వామి కల్యాణోత్సవం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి రాజంపేటలోని పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పట్టణ ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద వాహనాల రాకపోకలను కట్టుదిట్టం చేస్తున్నారు. ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి వెళ్లే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.