ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం కాళీయ మర్దన అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు మాడ వీధులలో విహరించారు. వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.