ఒంటిమిట్ట: వైభవంగా కోదండ రాముడి రథోత్సవం

85చూసినవారు
ఒంటిమిట్ట: వైభవంగా కోదండ రాముడి రథోత్సవం
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథాన్ని అధిష్టించి మాడ వీధుల్లో విహరించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్