గణేష్ నిమజ్జనం అందరము కలిసి విజయవంతం చేద్దామని అధికారులు పిలుపునిచ్చారు. గురువారం ఒంటిమిట్ట తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రవణమ్మ, ఎంపీడీవో రెడ్డయ్య, సిఐ కృష్ణంరాజు నాయక్, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినాయక విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.