ఒంటిమిట్ట మండల పరిధిలోని నందానగర్ లో ఆదివారం శ్రీపోతురాజు జాతర మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున నుండి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను సమర్పించారు. మేళాతాళాల వాయిస్తూ వైభవంగా జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. పోతురాజు కథలను భక్తులకు తెలియజేశారు. పోతురాజు స్వామి మరియు గంగమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.