సిద్ధవటం శివారులోని బ్రాందీ షాపు సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధవటంకు చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. ఆకుల వీధికి చెందిన చలపాటి రామ సుబ్బయ్య తన పొలం సమీపంలో బైకును మలుపు తిప్పుతుండగా భాకరాపేట నుండి సిద్ధవటం వైపుకు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ సుబ్బయ్య తలకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.