నందలూరు: 14న ఛలో నెల్లూరు ఎస్టీ వర్గీకరణ భేరిని విజయవంతం చేయండి
నందలూరు మండలంలో పాటూరు యానాది కాలనీలో నెల్లూరులో జరిగే ఎస్టీ వర్గీకరణ భేరిని విజయవంతం చేయాలని యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జలకం శివయ్య శుక్రవారం సాయంత్రం కరపత్రాలు పంపిణీ చేశారు. ఎస్టీ వర్గీకరణ సాధన కోసం ఈనెల 14వ తేదీన హలో యానాది ఛలో నెల్లూరు పేరిట ఎస్టీ వర్గీకరణ భేరి నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న యానాదులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.