సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని ఏపీ ఎస్పీడీసీఎల్ ఈఈ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం అరవపల్లి లోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తిని ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.