బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుండి 18 వరకు నేపాల్ లో జరగబోయే టి 20, వన్డే సిరీస్ లకు ఆంధ్ర రాష్ట్రం నుండి భారత్ జట్టుకు శివకోటి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నందలూరులో శివకోటి మాట్లాడుతూ, తన ఎంపికకు సహకరించిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా వారికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.