మానసిక ఆనందం కోసం క్రీడలు అవసరమని, గ్రామాలలో ఇటువంటి టోర్నమెంట్ వల్ల యువతలో ఐక్యత కలుగుతుందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు. శనివారం నందలూరు మండలం టీవీ పురంలో టిడిపి పార్లమెంటు అధ్యక్షులు జగన్ మోహన్ రాజు సహకారంతో నిర్వహిస్తున్న జై హనుమాన్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సుబ్బయ్య, సర్పంచ్ యానాది పాల్గొన్నారు.