ఓబులవారిపల్లె: క్రీడలు మానసిక ఉల్లాసాన్నికలిగిస్తాయి

69చూసినవారు
ఓబులవారిపల్లె: క్రీడలు మానసిక ఉల్లాసాన్నికలిగిస్తాయి
ఓబులవారిపల్లె మండలం ముదినేపల్లె లో క్రికెట్ లీగ్ టీమ్ పోటీలను ఆదివారం టీడీపీ మైనార్టీ నాయకులు జమీర్ అక్బర్ బాషా టాప్ వేసి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఓబులవారిపల్లె ఎస్సై మహేశ్ నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు శారీరకంగా దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. మండలంలో పోటీలలో దాదాపు 20 జట్లు తలపడునున్నాయని జమీర్ అక్బర్ బాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్