కడప - చెన్నై జాతీయ రహదారిపై ఒంటిమిట్ట బస్టాండ్ వద్ద ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ ఎటిఎం తిరిగి ప్రారంభించాలని గురువారం గ్రామస్తులు కోరారు. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారని ఏటీఎం అందుబాటులో లేకపోవడం వలన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే ఏటీఎం తెరిపించాలని ప్రజలు కోరుతున్నారు.