మనం నివాసం ఉంటున్న ఇంటి పరిసరాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శ్వేత అన్నారు. ఒంటిమిట్టలో బుధవారం ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉందని, నీరు నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు.