ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయం చేస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో కుక్కలు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. గ్రామంలో కుక్కల సంతతి పెరగకుండా అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.