రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కడప డీఈవో మీనాక్షి గురువారం కోదండ రాముడిని దర్శించుకున్నారు. సీతారామ లక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు ఆమెకు ఆలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట ఎంఈఓ వెంకటసుబ్బయ్య, ఎంఆర్పి సిబ్బంది పాల్గొన్నారు.