పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని కళ్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సీతా సమేత శ్రీరామునికి విశేష పూజలు జరిగాయి. అనంతరం టీటీడీ అర్చకులు వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామనామ స్మరణతో భక్తులు భక్తిశ్రద్ధలతో కళ్యాణం తిలకించారు.