ఒంటిమిట్ట: రైలు కింద పడి వ్యక్తి మృతి

10చూసినవారు
ఒంటిమిట్ట: రైలు కింద పడి వ్యక్తి మృతి
కడప జిల్లాలోని ఒంటిమిట్ట-మంటపంపల్లె రైల్వే స్టేషన్ల మధ్య రాచపల్లె బీసీ కాలనీకి చెందిన గగ్గూటూరు లాలయ్య (51) శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఇటీవల ఇంట్లో జరిగిన ఓ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. లాలయ్య మృతిపై అనుమానాలున్నాయని కుమారుడు రఫీ ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్