ఒంటిమిట్ట: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ..

67చూసినవారు
ఒంటిమిట్ట: ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ..
కడప జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మరోవైపు ఇదే ప్రమాదంలో వెనక వైపు నుంచి వస్తున్న హైవే పెట్రోల్ పోలీస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులంతా నంద్యాల జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్