ఒంటిమిట్ట: శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం
By భాస్కర్ రావు తుంగా 73చూసినవారుఒంటిమిట్టలో శుక్రవారం శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారు భక్తులకు కనువిందు చేశారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం.