రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం ఎదురుగా ఉన్న సంజీవ రాయుడు కి టీటీడీ అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు, గజమాల స్వామి వారికి సమర్పించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని సుందరంగా అలంకరించి దర్శనార్థం భక్తులను అనుమతించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.