ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిశాయని శనివారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బంది, ప్రత్యేక విభాగాల సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని, ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని అన్నారు.