జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ రమణ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల లోని విద్యుత్ శాఖ కార్యాలయాలలో విద్యుత్ బిల్లుల వసూలు పై శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది సాధారణ విధులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల బకాయిలు అధిక మొత్తంలో పెండింగ్ ఉన్నాయని ప్రజల సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.