పెనగలూరు: వినాయకుడి విగ్రహం అపహరణ కేసులో 13 మంది అరెస్ట్

251చూసినవారు
పెనగలూరు: వినాయకుడి విగ్రహం అపహరణ కేసులో 13 మంది అరెస్ట్
వినాయకుడి విగ్రహం అపహరణ కేసులో 13మందిని అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ తెలిపారు. శనివారం పెనగలూరు పోలీసు స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 24 తెల్లవారుజామున అత్తిగారిపల్లె బీసీ కాలనీ సమీపంలోని వినాయకుడి రాతి విగ్రహం అపహరణకు గురైంది. ఎస్ఐ ముద్రపల్లె క్రాస్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని అరెస్ట్ చేసి విచారణ చేయగా నేరం ఒప్పుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

సంబంధిత పోస్ట్