ఒంటిమిట్ట బృందావనంలో పందులు విహారం

79చూసినవారు
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బృందావనంలో సేద తీరుతారు. భక్తులు సేదతీరే బృందావనంలో పందులు విహరించడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రామాలయం పరిసరాలలో పందులు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్