రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలోని భాకరాపేట లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిమెంట్ రోడ్లకు శుక్రవారం టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు భూమి పూజ చేసి ప్రారంభించారు. చమర్తి రాక సందర్భంగా గ్రామస్తులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్మోహన్ రాజు మాట్లాడుతూ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు.