రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిద్ధవటం రేంజ్ లో 20 వేల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి తెలిపారు. ఆదివారం సిద్ధవటం అటవీశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. నర్సరీలో పెంచిన మొక్కలను ప్రజలు పెంచుకునేందుకు ఉచితంగా అందిస్తామని ఆమె తెలిపారు.