పులుల గణన కొరకు సిద్ధవటం అటవీ రేంజ్ లో 128 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సిద్ధవటం అటవీశాఖ అధికారిణి కళావతి తెలిపారు. శుక్రవారం సిద్ధవటంలో ఆమె మాట్లాడుతూ, డీఎఫ్ఓ వినీత్ కుమార్ ఆదేశాల మేరకు పులుల గణన కొరకు సిద్ధవటం రేంజ్ లోని 64 ప్రాంతాలలో ఒక్కోచోట రెండు కెమెరాలు చొప్పున 128 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది 27 స్థానాలలో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.