అడవిలో నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం అటవీశాఖ రేంజర్ కళావతి హెచ్చరించారు. మండలంలోని ఎస్. రాజంపేట, వంతాటి పల్లి గ్రామాలలో శుక్రవారం సిద్ధవటం అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవిలో అగ్ని ప్రమాదాలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్ కళావతి మాట్లాడుతూ అడవికి నిప్పు పెట్టడం వలన అనేక రకమైన నష్టాలు జరుగుతాయని తెలిపారు.