పుల్లంపేట: దేవరకొండలో వైభవంగా ప్రారంభమైన కంప తిరణాల

64చూసినవారు
పుల్లంపేట: దేవరకొండలో వైభవంగా ప్రారంభమైన కంప తిరణాల
పుల్లంపేట మండలం దేవరకొండలో శ్రీ కనక రుద్రమ్మ తిరణాల గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంప తిరణాలగా పిలవబడే ఈ తిరణాల రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. శ్రీకనక రుద్రమ్మ ను దర్శించుకోవడానికి ఉమ్మడి కడప జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట, కోడూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రమణ, వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్