రాజంపేట: ఏ. పి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు స్టాప్ ఏర్పాటు

78చూసినవారు
ఏ. పి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు రాజంపేట రైల్వే స్టేషన్ లో స్టాపింగ్ ఏర్పాటు చేయడం స్థానిక ప్రజలకు పెద్ద ఊరట అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ. ఈ రైలు తిరుపతి, కడప, రాజంపేట ప్రాంతాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపరచడంలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి జెండా ఊపి రైలును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్