పోలి చెరువు వేలాది ఎకరాల విస్తీర్ణం ఉండగా వైకాపా ప్రభుత్వంలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురైందని, పోలి చెరువులో సర్వే నిర్వహించి కబ్జాదారుల నుండి చెరువును రక్షించాలని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ తెలిపారు. శనివారం పోలి రెవెన్యూ గ్రామ సదస్సులో మండల తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కొండలను సైతం పిండి చేసి వందలాది ఎకరాలను ఆక్రమించుకున్నారని తెలిపారు.