ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలతో పాటు అన్నమయ్య జిల్లా కూడా అన్ని రంగాలలో వెనుకబడి ఉందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ అన్నారు. శనివారం రాజంపేట బిజెపి కార్యాలయంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు అన్నమయ్య జిల్లాలో మరింత మెరుగవ్వాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాగోతు రమేష్ నాయుడు పాల్గొన్నారు.