రాజంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం ఉదయం పట్టణంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కు సంబంధించి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో, కమిషనర్ స్వయంగా వీధుల్లోకి వచ్చి మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు ఇంటి వద్దకు వచ్చి చెత్తను సేకరిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు అని తెలిపారు.