ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి పై అవగాహన కలిగి ఉన్నప్పుడే టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణం సాధ్యమని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సానే శేఖర్, టీబీ పర్యవేక్షకులు జయ ప్రకాష్ అన్నారు. టీబీ వ్యాధి అవగాహన మాసోత్సవాలలో భాగంగా గురువారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు.